సోమవారం 18 జనవరి 2021
Nizamabad - Nov 03, 2020 , 00:48:49

ధాన్యం కొనుగోళ్లపై అర్థరహిత ఆరోపణలు

ధాన్యం కొనుగోళ్లపై అర్థరహిత ఆరోపణలు

పబ్బం గడుపుకోవడానికే ప్రతిపక్ష పార్టీల చిల్లర రాజకీయాలు

బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌

బోధన్‌:  రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నదని బోధన్‌ ఎమ్మెల్యే మ హ్మద్‌ షకీల్‌ అన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నా ప్రతిపక్షాలు మాత్రం అర్థరహిత ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని దుయ్య బట్టారు. 

సోమవారం బోధన్‌ పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కొవిడ్‌ సమయంలో నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేసిన అధికారులు, నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపా రు.  ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నియోజకవర్గంలో  దెబ్బతిన్న రోడ్లకు త్వరలో మరమ్మతు చే యిస్తామన్నారు.   రైతులు పండించిన ధాన్యం విషయంలో ఇబ్బందిపడవద్దని, చిన్నపాటి సమస్యలు తలెత్తినా ఎప్పటికప్పుడు కలెక్టర్‌ నారాయణరెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డితో మాట్లాడి  పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో  బోధన్‌ నియోజకవర్గం ప్రథమస్థానంలో ఉందని తెలిపారు. రైతుల విషయంలో రాజకీయ పార్టీలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని ప్రతి పక్షాలకు హితవు పలికారు.  కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ రజితాయాదవ్‌, బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌, తహసీల్దార్‌ గఫార్‌మియా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తూము పద్మావతి, వైస్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఎహెతే షాం, బోధన్‌, ఎడపల్లి మండలాల ఎంపీపీలు బు ద్దె సావిత్రి రాజేశ్వర్‌, కొండెంగల శ్రీనివాస్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గిర్దావర్‌ గంగారెడ్డి, కౌన్సిలర్లు తూము శరత్‌రెడ్డి, శ్రీకాంత్‌ గౌడ్‌, నాయకులు అశ్వాక్‌ అ హ్మద్‌, వాసే, రఫీయుద్దీన్‌, నాయకులు తదితరు లు పాల్గొన్నారు.