అవరోధాలను అధిగమిస్తేనే ఉద్యోగ సాధన

నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి
పోలీసు ఉద్యోగ సాధన శిక్షణ ప్రారంభం
ఇందూరు : కఠోర సాధనతోనే పోలీసు ఉద్యోగాలు సాధించవచ్చని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన వారికి ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగ సాధ న కోసం నాగారంలోని రాజారాం స్టేడియం లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కార్యక్రమా న్ని కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ లక్ష్యాన్ని సాధించే వరకు పట్టు వదలకుం డా సాధన చేయాలని సూచించారు. ఇంటర్ విద్యాశాఖ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన ఈ ఉచిత శిక్షణ ద్వారా పోలీసు ఉద్యోగాలను సాధించే వరకు అభ్యర్థులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఒడ్డెన్న మాట్లాడుతూ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆదేశానుసారం జిల్లాలోని 150 మంది అభ్యర్థులను శిక్షణ కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, ప్రతిరోజూ దేహదారుఢ్యాన్ని పెంపొందించేందుకు ఫిజికల్ డైరెక్టర్లు ట్రైనింగ్ ఇస్తారని తెలిపారు. ఉచిత శిక్షణను మంచి అవకాశంగా తీసుకుని ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వసతి సౌకర్యం కల్పించలేకపోతున్నామని, భవిష్యత్తులో పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ప్రతి విద్యార్థికీ స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తామని, అభ్యర్థుల హాజరును కచ్చితంగా పర్యవేక్షిస్తామని, క్రమం తప్పకుండా శిక్షణ తరగతులకు హాజరు కావాలన్నారు. అభ్యర్థుల రన్నింగ్ శిక్షణను కలెక్టర్ నారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో నాగారం పోలీస్స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్యాంసుందర్, శిక్షణ కన్వీనర్, బాలుర కళాశాల ప్రిన్సిపాల్ యకీనుద్దీన్, జిల్లా ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు చిరంజీవి, ప్రభుత్వ అధ్యాపకుల సం ఘం అధ్యక్షుడు చంద్ర విఠల్, సీనియర్ ప్రిన్సిపాల్ రఘురాజ్ మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి కర్నె శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ శంకర్, నిర్వాహకులు ధరత్పాల్, పాండురంగం, అధ్యాపకుడు సాయిలు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు.