నిలకడగా ‘నిజాంసాగర్' నీటి మట్టం

నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 1405.00 అడుగుల (17.80టీఎంసీలు) పూర్తిస్థాయి నీటి మట్టంతో ఉంది. ఎగువ భాగం నుంచి కేవలం 245 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండడంతో అంతే స్థాయిలో గేట్ల ద్వారా లీకేజీ రూపంలో బయటికి ప్రవహిసున్నదని డీఈఈ దత్తాద్రి ఆదివారం తెలిపారు. ఎగువ భాగం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోకు అనుగుణంగా నీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
గోదావరిలో తగ్గిన నీటి ప్రవాహం
రెంజల్ : రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నదిలో నీటి ప్రవాహం తగ్గింది. అక్టోబర్ 28వ తేదీన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మూసివేయడంతో ఎగువ వైపు నుంచి నీటి ప్రవహం లేక నదిలో నీటి మట్టం నిలకడగా కొనసాగుతున్నది. గతేడాది ఆశించిన మేర వర్షాలు లేకపొవడంతో నదికి ఇరువైపులా రేవు లు బయటికి తేలాయి. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడంతో నదిలోని పురాతన శివాలయం నీట మునిగింది. ప్రస్తుతం నీటి ఉధృతి తగ్గిపోవడంతో శివాలయ శిఖరం బయటికి తేలుతున్నది. పర్వదినాల్లో పుణ్య స్నానాలు అచరించే భక్తులకు పుష్కర ఘాట్ల వద్ద నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. గోదావరి నదికి ఆనుకొని నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా సాగుకు పుష్కలంగా నీరు ఉండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
- శర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ ఫిక్స్
- గణతంత్ర వేడుకల్లో బ్రహ్మోస్ క్షిపణుల ప్రదర్శన
- ఏజ్ గ్యాప్‌పై నోరు విప్పిన బాలీవుడ్ నటి
- ఎవరిని వదిలేది లేదంటున్న డేవిడ్ వార్నర్
- 15 నిమిషాల్లో దోపిడీ చేసి.. 15 గంటల్లో పట్టుబడ్డారు
- అంటార్కిటికా దీవుల్లో భూకంపం..
- డ్రైవరన్నా.. సలాం!
- ఓటీటీలో అడుగుపెట్టబోతున్న మాస్టర్
- ఎర్రలైటు పడితే ఆగాలి.. గ్రీన్ పడ్డాకే కదలాలి
- కోపంతో కాదు ప్రేమతోనే..