బుధవారం 02 డిసెంబర్ 2020
Nizamabad - Nov 01, 2020 , 00:51:31

ఎమ్మెల్సీని కలిసిన టీఆర్‌ఎస్‌వీ నాయకులు

ఎమ్మెల్సీని కలిసిన టీఆర్‌ఎస్‌వీ నాయకులు

రుద్రూర్‌(వర్ని)/ఖలీల్‌వాడి: టీఆర్‌ఎస్‌వీ జిల్లా కో ఆర్డినేటర్‌ ఎజాజ్‌ ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా శ్రీకుమార్‌, చేపూర్‌ వినీత్‌, వినయ్‌, చిరంజీవి,  అభిలాష్‌, ఇమ్రాన్‌ తదితరులు ఎమ్మెల్సీని కలిశారు. నిజామాబాద్‌ నగరానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు పబ్బ సాయిప్రసాద్‌ ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు ఫొటోను బహూకరించారు.