గురువారం 03 డిసెంబర్ 2020
Nizamabad - Nov 01, 2020 , 00:51:31

అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం

అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం

రుద్రూర్‌: అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికలు తీసుకురాకుండా మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారని అధికారులపై పలువురు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్‌లో ఎంపీపీ అక్కపల్లి సుజాత అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఐసీడీఎస్‌, ఐకేపీ, విద్య, విద్యుత్‌ తదితర శాఖల అధికారులు అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న పనులను వివరించారు. సిద్ధాపూర్‌ సర్పంచ్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ తమ గ్రామంలో అభివృద్ధి పనులను నాణ్యతలోపంతో చేపడుతున్నారని, అధికారులకు వివరించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు వివిధ అంశాలపై మాట్లాడారు. సమావేశంలో ఎంపీడీవో బాలగంగాధర్‌, జడ్పీటీసీ నారోజి గంగారాం,  ఏఎంసీ చైర్మన్‌ సంజీవ్‌, వైస్‌ ఎంపీపీ సాయిలు, ఎంపీవో సాయిలు, విండో చైర్మన్లు సంజీవ్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

వర్ని మండలం జాకోరా, రుద్రూర్‌ మండల కేంద్రానికి చెందిన పలువురు బాధితులకు ప్రజాప్రతినిధులు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను శనివారం అందజేశారు. రుద్రూర్‌ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీటీసీ గంగారాం, ఎంపీపీ సుజాత ఇద్దరు బాధితులకు, వర్ని మండలం జాకోరాలో సర్పంచ్‌ గోదావరి ఒకరికి చెక్కులు అందజేశారు.