గురువారం 03 డిసెంబర్ 2020
Nizamabad - Nov 01, 2020 , 00:51:29

స్ఫూర్తిప్రదాతల అడుగుజాడల్లో నడవాలి

స్ఫూర్తిప్రదాతల అడుగుజాడల్లో నడవాలి

నమస్తే తెలంగాణ యంత్రాంగం: వాల్మీకి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వంటి స్ఫూర్తిప్రదాతల అడుగుజాడల్లో నడుచుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు.  కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో మహర్షి వాల్మీకి, ఉక్కుమనిషి, భారతరత్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి  శనివారం ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి మనిషిలా ఎలా జీవించాలని మానవాళికి ధర్మమార్గాన్ని వాల్మీకి చూపారన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌  బ్రిటిష్‌ రాజ్యానికి వ్యతిరేకంగా దేశంలో పలు ఉద్యమాల్లో పాల్గొని గొప్ప నాయకుడిగా ఎదిగారన్నారు. స్వాతంత్య్రానంతరం పలు కీలకనిర్ణయాలలో భాగస్వామై సంస్థానాలను దేశంలో విలీనం చేశారని, దేశాన్ని విశాల భారతదేశంగా తీర్చిదిద్దారని ఆయన ప్రశంసించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌, కలెక్టరేట్‌ ఏవో సుదర్శన్‌, కలెక్టరేట్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

కమ్మర్‌పల్లి, జక్రాన్‌పల్లి, నిజామాబాద్‌ రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఎంపీపీలు లోలపు గౌతమి, డీకొండ హరిత, బానోత్‌ ఉషా వల్లభాయ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవోలు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూర్‌ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో వల్లభాయ్‌ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పుప్పాల శివరాజ్‌కుమార్‌, జీవీ నర్సింహారెడ్డి, జెస్సు అనిల్‌ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పెర్కిట్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. భీమ్‌గల్‌ మండలం జాగిర్యాల్‌ ప్రభుత్వ పాఠశాలలో, మోర్తాడ్‌ మండలం పాలెం ఉన్నత పాఠశాల, తహసీల్‌ కార్యాలయంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు ఘన నివాళులు అర్పించారు. మాక్లూర్‌ మండల కేంద్రంలోని కేజీబీవీలో ప్రత్యేకాధికారిణి ప్రగతి ఆధ్వర్యంలో వల్లభాయ్‌ జయంతిని నిర్వహించారు. పీహెచ్‌సీ వైద్యుడు సంజీవ్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. నవీపేట్‌, రెంజల్‌ మండలాల్లో మహర్షి వాల్మీకి, సర్దార్‌ వల్లభాయ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. 

డిచ్‌పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను ఘనంగా నిర్వహించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోటగిరి మండలంలోని కొడిచెర్ల ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం నరేందర్‌ ఆధ్వర్యంలో వల్లభాయ్‌ జయంతిని నిర్వహించారు. ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం శంకర్‌, వీడీసీ చైర్మన్‌ పెద్ద బాలయ్య వల్లభాయ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు. కొవిడ్‌ వ్యాప్తి సమయంలోనూ సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. నిజామాబాద్‌ నగరంలోని వర్నిచౌరస్తాలో రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో వల్లభాయ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నగర పరిధిలోని గూపన్‌పల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో హెచ్‌ఎం శకుంతలాదేవి ఆధ్వర్యంలో వాల్మీకి, వల్లభాయ్‌ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఘనపురం దేవేందర్‌, మంజులత, శ్రీరామ్‌లక్ష్మణ్‌, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.