శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nizamabad - Oct 31, 2020 , 00:28:50

‘వీధి దీపాల నిర్వహణ ప్రైవేటుకు అప్పగించొద్దు’

‘వీధి దీపాల నిర్వహణ ప్రైవేటుకు అప్పగించొద్దు’

ఇందల్వాయి: గ్రామాల్లో వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలను ప్రైవేటు సంస్థకు  అప్పగించొద్దని మండలంలోని సర్పంచులు ప్రభుత్వాన్ని కోరా రు. ఈ మేరకు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మో హన్‌ నాయక్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో సమావేశం నిర్వహించి తీర్మానం చేశారు. తీర్మాన కాపీలను మం డల, జిల్లా స్థాయి అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే జాప్యం జరుగే అవకాశముందని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. సమావేశంలో ఫోరం జనరల్‌ సెక్రటరీ తేలు విజయ్‌కుమార్‌, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.