శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nizamabad - Oct 31, 2020 , 00:28:49

రోడ్డు పనులు ప్రారంభించాలని మంత్రికి వినతి

రోడ్డు పనులు ప్రారంభించాలని మంత్రికి వినతి

జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లికొండ ఎక్స్‌రోడ్‌ నుంచి జాన్కంపేట్‌ వరకు మంజూరైన డబుల్‌ రోడ్డు పనులను త్వరగా ప్రారంభించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డిని తొర్లికొండ, బ్రాహ్మణపల్లి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు కోరారు. ఈమేరకు మంత్రిని గురువారం హైదరాబాద్‌లో కలిసి విన్నవించారు. రోడ్డును మంజూరు చేసిన మంత్రికి, ఇందుకోసం కృషి చేసిన ఎమ్మెల్యే బాజిరెడ్డికి రెండు గ్రామాల నాయకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ పుష్పగుచ్ఛం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో ఎంపీపీ హరిత, జడ్పీటీసీ తనూజారెడ్డి, తొర్లికొండ సర్పంచ్‌ సురేశ్‌, ఎంపీటీసీలు రాజు, పద్మ, సొసైటీ చైర్మన్‌ అన్వేశ్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ భూమేశ్వర్‌, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రాజమల్లు, మల్లేశ్‌ గౌడ్‌, జానకిరామ్‌, రాణా ఉన్నారు.