ఆదివారం 29 నవంబర్ 2020
Nizamabad - Oct 29, 2020 , 00:37:07

రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

ఎమ్మెల్యే  ఆశన్నగారి జీవన్‌రెడ్డి 

ఆర్మూర్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ మున్సిపల్‌లోని మార్కెట్‌ కమిటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, పెర్కిట్‌లో ఉన్న పీఏసీఎస్‌ ప్లాట్‌ఫాంను ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను రైతులు పొందాలన్నారు. పిప్రి గ్రామంలో గోదాం, వైకుంఠధామం పను లు, మంథనిలో సీసీ కెమెరాలను, ఎంపీటీసీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినిత, వైస్‌చైర్మన్‌ షేక్‌ మున్నా, ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్‌ సంజీవ్‌రావు, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి విఠల్‌, కమిషనర్‌ శైలజ, పెర్కిట్‌ సొసైటీ చైర్మన్‌ భోజారెడ్డి, వైస్‌చైర్మన్‌ గంగారెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ లింగాగౌడ్‌, కౌన్సిలర్లు గంగామోహన్‌ చక్రు, శంకర్‌, ప్రసాద్‌, లత, నాయకులు పండిత్‌ పవన్‌,  శ్రీనివాస్‌, కాశీరాం, చిన్నారెడ్డి, ఇంతియాజ్‌, గంగాధర్‌, పూజా నరేందర్‌, గంగామోహన్‌, ఆర్మూర్‌ ఎంపీపీ నర్సయ్య, జడ్పీటీసీ సంతోష్‌, మండల అధ్యక్షుడు లింగారెడ్డి, పిప్రి సొసైటీ చైర్మన్‌ సోమ హేమంత్‌రెడ్డి, మంథని సర్పంచ్‌ లింబారెడ్డి, పిప్రి సర్పంచ్‌ దేవి, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు సురేశ్‌, గంగాధర్‌ పాల్గొన్నారు. అనంతరం పిప్రి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు ముత్తెన్న సోదరి, సోదరుడి కుమారుడు మృతి చెందగా స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పరామర్శించారు. మంథని గ్రామానికి చెందిన నర్సారెడ్డిని కూడా ఎమ్మెల్యే పరామర్శించారు. 

దవాఖానలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ఆర్మూర్‌, మామిడిపల్లిలో ఉన్న లాలన పిల్లల దవాఖాన, బాల్‌రా జ్‌ మెమోరియల్‌ దవాఖానను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రారంభించి  ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దవాఖాన పరిసరాల్లో యాజమాన్యం, వైద్య బృందాలతో కలిసి మొక్క నాటి నీళ్లు పోశారు. బాల్‌రాజ్‌ మెమోరియల్‌ దవాఖాన వైద్యులు ఉప్పు రాకేశ్‌, డాక్టర్‌ ఉప్పు ఝాన్సీరాణి, లాలన చిల్డ్రన్స్‌ దవాఖాన వైద్యులు శ్రావణ్‌రెడ్డి, డాక్టర్‌ తేజస్వి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, చైర్‌పర్సన్‌ పం డిత్‌ వినిత, వైస్‌చైర్మన్‌ షేక్‌ మున్నా, మాజీ జడ్పీటీసీ ఉప్పు రణధీర్‌, జక్రాన్‌పల్లి జడ్పీటీసీ తనూజ, ఆర్మూర్‌ డిప్యూటీ డీఎం హెచ్‌వో రమేశ్‌, ఎంజే దవాఖాన వైద్యులు మధుశేఖర్‌, నాయకు లు పండిత్‌ పవన్‌, పండిత్‌ ప్రేమ్‌ పాల్గొన్నారు.