ఆదివారం 29 నవంబర్ 2020
Nizamabad - Oct 29, 2020 , 00:37:07

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత

నిజామాబాద్‌ రూరల్‌/డిచ్‌పల్లి/భీమ్‌గల్‌ : నగర శివారులోని గూపన్‌పల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్‌రెడ్డికి, డిచ్‌పల్లి మండలం మిట్టాపల్లి గ్రామానికి చెందిన చిన్న గంగన్నకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థికసాయం చెక్కులను ఎమ్మెల్సీ వీజీగౌడ్‌ బుధవారం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు సంతోష్‌, సర్పంచ్‌ గణేశ్‌, ఎంపీటీసీ బాల గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ డిచ్‌పల్లి మండల అధ్యక్షుడు కృష్ణ, నాయకులు లక్ష్మీనర్సయ్య, రామకృష్ణ, కిషన్‌, సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు. భీమ్‌గల్‌ మండలం జాగిర్యాల్‌ గ్రామానికి చెందిన నలుగురికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎంపీపీ ఆర్మూర్‌ మహేశ్‌, జడ్పీటీసీ రవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య అందజేశారు.