శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nizamabad - Oct 29, 2020 , 00:37:07

ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలి

ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలి

నిజామాబాద్‌ సిటీ: ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడాలని సీపీ కార్తికేయ అన్నారు. సమాజంలో పోలీస్‌శాఖ కీలకమైన శాఖ అని, విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరిస్తూ సంస్మరణ వారోత్సవాలను ఈనెల 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని అన్నారు. సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్‌ పరేడ్‌మైదానంలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సీపీ ప్రారంభించి రక్తదానం చేశారు. శిబిరంలో సుమారు 40 మంది సిబ్బంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో  డీసీపీలు ఉషావిశ్వనాథ్‌, తిరునగిరి, ఏసీపీ భాస్కర్‌, బ్లడ్‌ బ్యాంక్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ ఫరీదాబేగం, ప్రేమ్‌చంద్‌, సందీప్‌, దేవాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.