శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nizamabad - Oct 28, 2020 , 00:31:38

గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన

గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన

ఆర్మూర్‌ : మండలంలోని మిర్ధాపల్లి, దేగాం గ్రామాల్లో మంగళవారం కేంద్ర బృందం పర్యటించింది. బృందం సభ్యులు బాల మురళి, వంశీకృష్ణ గ్రామాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జరిగిన పనుల వివరాలు, స్వయం సహాయక సంఘాల పనితీరును తెలుసుకున్నారు. అనంతరం గ్రామాల్లో కొనసాగుతున్న వైకుంఠధామం, పల్లెప్రకృతి వనాల పనులను పరిశీలించారు. వారి వెంట ఆర్మూర్‌ ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్‌, ఎంపీడీవో గోపిబాబు, ఉపాధిహామీ ఏపీవో సురేశ్‌, సర్పంచులు సౌడ సాయిలత, గడ్డం సరోజ, ఉప సర్పంచులు సౌడ మధువర్మ, గంగారెడ్డి, ఎంపీటీసీలు ఉన్నారు.