గురువారం 03 డిసెంబర్ 2020
Nizamabad - Oct 28, 2020 , 00:31:38

కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

డిచ్‌పల్లి: రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ ఏడో బెటాలియన్‌ ఆవరణలో ఉన్న శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం లో బ్రహ్మోత్సవాలు కమాండెంట్‌ ఎన్‌వీ సత్యశ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం స్వా మివారికి ఆరాధన, గరుడ ప్రతిష్ఠ, సోమకుంభ స్థాపన, వాస్తు స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, అంకురార్పణ హో మం, వాస్తు హోమం, ప్రాణ ప్ర తిష్ఠ, ధ్వజారోహణం తదితర విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఆర్‌ఐలు పి.వెంకటేశ్వర్లు, బి.అనిల్‌కుమార్‌, ఎల్‌.మహేశ్‌, ఎం.నరేశ్‌, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, సమీ ప గ్రామాల భక్తులు పాల్గొన్నారు.