శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nizamabad - Oct 28, 2020 , 00:31:38

దుర్గామాతకు వీడ్కోలు

దుర్గామాతకు వీడ్కోలు

తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న దుర్గాదేవికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలి

కారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణతో పూజలందుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని రెంజల్‌, రామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్‌ తదితర మండలాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు దుర్గాదేవీ శోభాయాత్ర నిర్వహించారు. గ్రామీణ సంప్రదాయం ఉట్టిపడేలా మహిళలు, యువతులు  దాండియా ఆడుతూ, బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అనంతరం సమీప చెరువులు, వాగుల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు. నిజామాబాద్‌ జిల్లాలోని రెంజల్‌ మండలం కందకుర్తి త్రివేణి సంగమంలో మంగళవారం తెల్లవారు జాము  వరకు నిమజ్జనోత్సవం కొనసాగింది. నదిలో నీళ్లు ఎక్కువగా ఉండడంతో జాలర్ల సహాయంతో విగ్రహాలను నిమజ్జనం చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.                                                      

- నమస్తే తెలంగాణ యంత్రాంగం