శనివారం 05 డిసెంబర్ 2020
Nizamabad - Oct 27, 2020 , 00:16:56

సాగునీటి పథకాలతో సత్ఫలితాలు

సాగునీటి పథకాలతో సత్ఫలితాలు

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

వేల్పూర్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన సాగునీటి పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని రాష్ట్ర హౌసింగ్‌, రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్‌ మండల కేంద్రంలో మరుసుకుంటను మంత్రి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సత్ఫలితాలు ఇస్తోందన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా 200 కిలోమీటర్ల దూరంలోని గోదావరి జలాలు ఎగువకు ప్రవహించి వరద కాలువలను నింపుతున్నాయన్నారు. వర్షాలు కురవకున్నా వరద కాలువల ద్వారా చెరువులు నింపుతున్నామని తెలిపారు. ఎస్సారెస్పీపై ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లను అవసరమున్న రోజులు నడుపుకొనే అవకాశం ఏర్పడిందన్నారు. సోమవారం వాడి గ్రామంలో రూ.12 లక్షలతో నిర్మించనున్న హనుమాన్‌ ఆలయ నిర్మాణానికి మంత్రి భూమి పూజ నిర్వహించారు. మంత్రి వెంట ఆర్మూర్‌ ఆర్టీవో శ్రీనివాసులు, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, ఎంపీటీసీ మొండి మహేశ్‌, సర్పంచ్‌ తీగల రాధ, ఉపసర్పంచ్‌ పిట్ల సత్యం, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు బబ్బురు ప్రతాప్‌, సామ మహిపాల్‌, సామ మహేందర్‌, గ్రామశాఖ అధ్యక్షుడు జుంబరాతి నరేశ్‌, సర్పంచ్‌ గోపు మహేశ్‌, జడ్పీటీసీ అల్లకొండ, పార్టీ మండల కన్వీనర్‌ నాగధర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి, ఎంపీటీసీ నీరజారెడ్డి, పచ్చలనడ్కుడ సొసైటీ చైర్మన్‌ రాజన్న, గంగారెడ్డి పాల్గొన్నారు.