మంగళవారం 26 జనవరి 2021
Nizamabad - Oct 25, 2020 , 00:46:23

‘మూడు రోజుల్లోనే ధాన్యం డబ్బులు’

‘మూడు రోజుల్లోనే ధాన్యం డబ్బులు’

కోటగిరి/నందిపేట్‌ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల బ్యాంకు ఖాతాల్లో మూడు రోజుల్లో డబ్బులు జమ చేస్తామని బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి తెలిపారు. కోటగిరి మండలం ఎత్తొండ, యాద్గార్‌పూర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచులు సాయిబాబా, విజయ సాయన్న, జడ్పీటీసీ శంకర్‌పటేల్‌, ఎంపీటీసీలు అనంత విఠల్‌, ఫారూక్‌, ఏఎంసీ చైర్మన్‌ నీరడి గంగాధర్‌, ఎత్తొండ విండో చైర్మన్‌ అశోక్‌పటేల్‌, కిశోర్‌చంద్ర, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ ఎజాజ్‌ఖాన్‌, యాద్గార్‌పూర్‌ ఉప సర్పంచ్‌ ఆంజనేయులు పాల్గొన్నారు. నందిపేట్‌ మండలం మల్లారంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని చింరాజ్‌పల్లి సొసైటీ చైర్మన్‌ బొంకం గంగారెడ్డి, సర్పంచ్‌ అర్జున్‌, ఎంపీటీసీ శ్రీను ప్రారంభించారు. సొసైటీ కార్యదర్శి నర్సయ్య, టీఆర్‌ఎస్‌ నాయకుడు సాగర్‌ పాల్గొన్నారు.  


logo