శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nizamabad - Oct 25, 2020 , 00:46:21

పూల పండుగ

పూల పండుగ

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

జిల్లాలోని పలు మండలాల్లో సుద్దుల బతుకమ్మ సంబురాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాలు, మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లోని వీధులన్నీ కోలాహలంగా కనిపించాయి. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆడిపాడారు. అనంతరం సమీప చెరువుల్లో నిమజ్జనం చేసి వెంట తెచ్చుకున్న సద్దులను కుటుంబ సభ్యులతోకలిసి ఆరగించారు.

-ఇందల్వాయి/జక్రాన్‌పల్లి/సిరికొండ/ ధర్పల్లి/నిజామాబాద్‌ రూరల్‌/రెంజల్‌/ ఆర్మూర్‌/ఎడపల్లి (శక్కర్‌నగర్‌)