ఆదివారం 29 నవంబర్ 2020
Nizamabad - Oct 24, 2020 , 01:02:09

నాణ్యతతో పనులు చేపట్టాలి

నాణ్యతతో పనులు చేపట్టాలి

ఆర్మూర్‌: పట్టణంలో సీసీ రోడ్లు పది కాలాలపాటు మన్నేలా నాణ్యతతో నిర్మించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సూచించారు. ఆర్మూర్‌లోని 3వ వార్డులో దేవాంగ సంఘం నుంచి పెర్కిట్‌ వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినిత, వైస్‌ చైర్మన్‌ షేక్‌ మున్నా, కమిషనర్‌ శైలజ, కౌన్సిలర్లు వరలక్ష్మి, సుజాత, గంగామోహన్‌చక్రు, మాజీ వైస్‌చైర్మన్‌ లింగాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పండిత్‌ ప్రేమ్‌, పండిత్‌ పవన్‌, లింబాద్రి గౌడ్‌, భూషణ్‌, రమేశ్‌, చిన్నారెడ్డి పాల్గొన్నారు.

రైల్వే గేటు పనుల పరిశీలన

ఆర్మూర్‌ పట్టణం మామిడిపల్లి శివారులోని రైల్వేగేటును ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలిక రైల్వేగేటు వద్ద ఏర్పడిన గుంత మరమ్మతు పనులను నాయకులతో కలిసి పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. మామిడిపల్లి మాజీ సర్పంచ్‌ రవిగౌడ్‌, కౌన్సిలర్‌ రాము ఉన్నారు. 

బాధిత కుటుంబాలకు పరామర్శ..

ఆర్మూర్‌ పట్టణంతోపాటు మండలంలోని గోవింద్‌పేట్‌ గ్రామం లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పరామర్శించారు. 12వ వార్డు కౌన్సిలర్‌ తాటి హన్మాం డ్లు తండ్రి ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబాన్ని, ఆర్మూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ కొట్టాల మోహన్‌ తండ్రి మరణించడంతో వారి కుటుంబ సభ్యులను టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు, నాయకులతో ఎమ్మెల్యే వారి ఇండ్లకు వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గోవింద్‌పేట్‌లో మరణించిన బంటు రాజన్న, పంచరెడ్డి గంగాధర్‌ కుటుంబ సభ్యులను కూడా ఎమ్మెల్యే పరామర్శించారు. కౌన్సిలర్లు, గోవింద్‌పేట్‌ సర్పంచ్‌ జమున, ఉపసర్పంచ్‌ గంగాధర్‌, నాయకులు గంగాధర్‌, అశోక్‌ ఉన్నారు. 

డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నాణ్యతతో నిర్మించాలి..

డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నాణ్యతతో నిర్మించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌ ప్రభుత్వ ఆశయాల మేరకు కట్టుదిట్టంగా పకడ్బందీగా చేపట్టాలన్నారు. అంకాపూర్‌ సర్పంచ్‌ పూజితారెడ్డి, ఉపసర్పంచ్‌ కిశోర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఎంసీ.గంగారెడ్డి, ఎంపీటీసీ మహేందర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ గంగామోహన్‌ చక్రు, నాయకులు పాల్గొన్నారు. 

ప్రజల ముంగిట్లోకి ప్రభుత్వ పథకాలు..

మాక్లూర్‌: మండలంలోని అడవి మామిడిపల్లిలో నిర్మించిన వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ముంగిట్లోకి ప్రభు త్వ పథకాలను చేర్చడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తు న్నదని అన్నారు. రూ.12 లక్షలతో నిర్మించిన వైకుంఠ ధామాలు పూర్తి కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. మాక్లూర్‌ లో దుర్గామాతను దర్శించుకున్నారు. గ్రామంలో బాధిత కుటంబాలను పరామర్శించారు. ఎంపీపీ ప్రభాకర్‌, విండో చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ రజినీశ్‌, సర్పం చ్‌ చింత మల్లారెడ్డి, నాయకులు గణపతినాయక్‌, సుధాకర్‌, రంజిత్‌, అశోక్‌, గోవర్ధన్‌, పుణ్యరాజ్‌, భూషణ్‌, ఎంపీడీవో సక్రియా, తహసీల్దార్‌ ఆంజనేయులు పాల్గొన్నారు.