ఆదివారం 29 నవంబర్ 2020
Nizamabad - Oct 24, 2020 , 01:01:05

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

వేల్పూర్‌: నూతనంగా చేపట్టిన వైకుంఠధామం నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నిర్మిస్తున్న వైకుంఠధామాన్ని శుక్రవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వైకుంఠధామం పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సర్పంచ్‌ తీగల రాధ, ఉపసర్పంచ్‌ పిట్ల సత్యంను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఈజీఎస్‌ నిధు ల ద్వారా వైకుంఠధామాలను నిర్మిస్తున్నదని అన్నారు. పనులను త్వరగా పూర్తి చేయించాలని సూచించారు. మంత్రి వెంట అద నపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాసులు, డీఎల్‌పీవో శ్రీనివాస్‌, ఎంపీడీవో కరుణాకర్‌, సర్పంచ్‌ రాధ, ఎంపీటీసీ మహేశ్‌, ఉపసర్పంచ్‌ సత్యం, కార్యదర్శి వినోద్‌, వార్డు సభ్యులు మోహన్‌, దేవేందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు మహిపాల్‌ ఉన్నారు.

నూతన వాహనాలను ప్రారంభించిన మంత్రి 

రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్‌, ఆర్మూర్‌ ఆర్డీవోలకు కేటాయించి న నూతన వాహనాలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన వాహనాలకు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం వాహనాలను ఆర్డీవోలకు అందజేశారు.

ఆగ్రోరైతు సేవా కేంద్రం ప్రారంభం 

భీమ్‌గల్‌: పట్టణంలోని పూరాణీపేట్‌ రోడ్డులో ఆగ్రోరైతు సేవా కేంద్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సౌకర్యార్థం  ఆగ్రో సేవా కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, వ్యవసాయ శాఖ జేడీ గోవింద్‌, ఏడీఏ మల్లయ్య, డీసీవో సింహాచలం, జడ్పీటీసీ రవి, ఎంపీపీ మహేశ్‌, భీమ్‌గల్‌ మండల  అధ్యక్షుడు నర్సయ్య, షాపు యజమాని దైడి అరుణ్‌, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.