ఆదివారం 29 నవంబర్ 2020
Nizamabad - Oct 24, 2020 , 00:58:45

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

నమస్తే తెలంగాణ యంత్రాంగం: జిల్లాలో అధికశాతం కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ప్రారంభంకాగా.. పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు శుక్రవారం ప్రారంభించారు. ఇందల్వాయి మండలం వెంగల్‌పాడ్‌, కేకేతండా, గౌరారం, జీకే తండాలో, డిచ్‌పల్లి మండలం మిట్టపల్లిలో, ధర్పల్లి మండలం దమ్మన్నపేట్‌, మరియా తండా, డీబీతండా, రేకులపల్లిలో, జక్రాన్‌పల్లి మండలం పుప్పాలపల్లిలో, సిరికొండ మండలం పోత్నూర్‌, పెద్దవాల్గోట్‌, తాళ్ల రామడుగు, పందిమడుగు, చీమన్‌పల్లి,  దూప్యా తండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ సంబారి మోహన్‌, ధర్పల్లి జడ్పీటీసీ జగన్‌ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతుధర అందజేస్తున్నదని అన్నారు. రైతులు దళారులబారినపడి మోసపోవద్దని సూచించారు.  ఇందల్వాయి మండలంలోని  ఎంపీపీ రమేశ్‌ నాయక్‌, వైస్‌ ఎంపీపీ బూసాని అంజయ్య, ఎంపీటీసీ చింతల కిషన్‌, సొసైటీ చైర్మన్‌ తారాచంద్‌, సీఈవో నాగరాజు, నాయకులు బీరీశ్‌, క్రాంతి, వీడీసీ సభ్యులు గంగాధర్‌, సురేశ్‌ పాల్గొన్నారు. డిచ్‌పల్లి మండలంలో ఎంపీపీ గద్దె భూమన్న, సర్పంచ్‌ తేలు గణేశ్‌, ఎంపీటీసీ బాలగంగాధర్‌, సొసైటీ చైర్మన్‌ తారాచంద్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒడ్డెం నర్సయ్య, నాయకులు గంగరత్నం, నడిపన్న, లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు. ధర్పల్లి మండలంలో  ఎంపీపీ సారికారెడ్డి, వైస్‌ ఎంపీపీ నవీన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, సర్పంచులు లొక్కిడి విజయరాములు, రాజేందర్‌, ఎంపీటీసీ లక్ష్మి, సొసైటీ చైర్మన్‌ చెలిమెల చిన్నారెడ్డి, డైరెక్టర్లు సభావట్‌ శ్రీనివాస్‌నాయక్‌, విఠల్‌, బాలు, నాయకులు రాములు, గోపాల్‌, ఏపీఎం సునీత తదితరులు పాల్గొన్నారు. జక్రాన్‌పల్లి మండలంలోఎంపీపీ హరిత, జడ్పీటీసీ తనూజారెడ్డి, సొసైటీ చైర్మన్‌ ఆర్మూర్‌ గంగారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు డీకొండ శ్రీనివాస్‌, ఏవో దేవిక, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, సొసైటీ వైస్‌ చైర్మన్‌ రాజన్న, సర్పంచ్‌ దావుల పోసాని, ఎంపీటీసీలు అంకం లక్ష్మి, గంగారెడ్డి, పోతె రాజు, ఆర్మూర్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మైదాం రాజన్న,  సింకిద్రాపూర్‌ మాజీ ఎంపీటీసీ రాజు, మాదాపూర్‌ సర్పంచ్‌ లింగన్న, సొసైటీ కార్యదర్శి తిరుపతిరెడ్డి, డైరెక్టర్లు, నాయకులు సంతోష్‌, మహేశ్‌, రంగ్యా నాయక్‌, ఈశ్వర్‌, సతీశ్‌, ప్రకాశ్‌, దేవరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.  సిరికొండ మండలంలో సొసైటీ చైర్మన్‌ మైలారం గంగారెడ్డి, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు ఇమ్రాన్‌, ఏపీఎం కిరణ్‌, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. 

కోటగిరి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌, పొతంగల్‌  సొసైటీ ఆధ్వర్యంలో చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌ శాంతేశ్వర్‌ పటేల్‌ ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు పత్తి లక్ష్మణ్‌, వర్ని శంకర్‌, జడ్పీటీసీ శంకర్‌పటేల్‌, ఏఎంసీ చైర్మన్‌ గంగాధర్‌, కోటగిరి విండో చైర్మన్‌ కూచి సిద్ధూ, డైరెక్టర్లు పాల్గొన్నారు. 

మోర్తాడ్‌ మండలం దొన్కల్‌ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్‌ రాజేశ్వర్‌ ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఏలియా, సర్పంచ్‌ లావణ్య, ఎంపీటీసీ అశోక్‌, ముత్తెన్న, శ్రీనివాస్‌, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఆర్మూర్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మెప్మా పీడీ రాములు, ఏఈవో సవిత పరిశీలించారు. వారి వెంట ఏఈవో లింగేశ్వర్‌, మెప్మా టీఎంసీ ఉదయశ్రీ, సీవోలు సంతోష్‌, రాజలింగం, కేంద్రం ఇన్‌చార్జి నీలిమ ఉన్నారు. మాక్లూర్‌  మండలం వేణుకిసాన్‌నగర్‌లో కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షురాలు లక్ష్మి, సర్పంచ్‌ రమేశ్‌నాయక్‌ ప్రారంభించారు. వైస్‌ చైర్మన్‌ రమేశ్‌, ఉపసర్పంచ్‌ గంగాధర్‌నాయక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రంజిత్‌, సుక్కిసుధాకర్‌, శేఖర్‌రావు, కార్యదర్శి విష్ణు పాల్గొన్నారు. నందిపేట్‌ మండలం లక్కంపల్లి గ్రామంలో చింరాజ్‌పల్లి సొసైటీ చైర్మన్‌ బొంకం గంగారెడ్డి, ఆంధ్రానగర్‌లో సర్పంచ్‌ రామారావు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌, ఏపీఎం మాణిక్యం, సొసైటీ కార్యదర్శి నర్సయ్య, నాయకుడు మహేందర్‌ పాల్గొన్నారు.