గురువారం 03 డిసెంబర్ 2020
Nizamabad - Oct 22, 2020 , 01:54:12

పోలీసుఅమరులకు ఘననివాళి

పోలీసుఅమరులకు ఘననివాళి

డిచ్‌పల్లి/కోటగిరి: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన ఆయా కార్యక్రమాల్లో అమరులకు శాఖ సిబ్బంది నివాళులు అర్పించారు. డిచ్‌పల్లిలోని ఏడో బెటాలియన్‌లో కమాండెం ట్‌ సత్యశ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కమాండెంట్‌ అమరుల స్థూపానికి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి, నిజాయితీ, నిరాడంబరత, నిర్భయం, నిస్వార్థం, నిబద్ధత, నిష్కల్మషత్వం, సాహసం, సమర్థత పోలీసు గుండెల్లో విలీనమవుతాయన్నారు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు ధైర్యం కావాలని,  దాన్ని కొనసాగించేందుకు కృషి, పట్టుదలతోపాటు గొప్ప నమ్మకం ఉండాలని అన్నారు. ఈ లక్షణాలన్నీ పోలీసు హృదయంలో ఉంటాయని,  ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తారని అన్నారు. 

తీవ్రవాదుల దుశ్చర్య కారణంగా ఏడో బెటాలియన్‌కు చెందిన హెచ్‌.బిన్నేశ్వర్‌రావు, టీ.దేవీదాస్‌, ఆర్‌.సుంకన్న, బాబర్‌ అలీ, గులాం రసూల్‌,  ఎం.సుభాష్‌ చంద్రబోస్‌, ఎన్‌.ఈసయ్య, జవహార్‌, కె.మారుతీరావు, కె.వేణు, జె.వాసు అమరులయ్యారన్నారు. అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. కోటగిరి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సై మచ్చేందర్‌రెడ్డితోపాటు సిబ్బంది అమరులకు నివాళులు అర్పించారు. అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎస్సై అన్నారు.