గురువారం 03 డిసెంబర్ 2020
Nizamabad - Oct 22, 2020 , 01:52:34

రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలు అభినందనీయం

రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలు అభినందనీయం

మున్సిపల్‌ కార్మికులకు సబ్బులు, శానిటైజర్ల పంపిణీ

బోధన్‌ : కరోనా వంటి సంక్షోభ సమయం లోనూ ఆపదలో ఉన్న రోగులకు రక్తాన్ని అందించడమే కాకుండా ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించిన మున్సిపల్‌ కార్మికులకు స బ్బులు, శానిటైజర్లు అందిస్తున్న రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలు అభినందనీయమని బోధ న్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తూము పద్మావతి అన్నారు. బోధన్‌ మున్సిపాలిటీలోని 180 మంది పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, శానిటైజర్లను రెడ్‌క్రాస్‌ సొసైటీ బుధవారం  పంపిణీ చేసింది. పట్టణంలోని విద్యావికా స్‌ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోధన్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తూము పద్మావతితో పాటు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎహెతేషాం సోహైల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రామలిం గం, రెడ్‌సొసైటీ ప్రతినిధులు మున్సిపల్‌ కార్మికులకు అందించా రు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణం ఆరోగ్యంగా ఉంటుందన్నా రు.   వైస్‌ చైర్మన్‌ మాట్లాడుతూ కరోనా సమయంలో మున్సిపల్‌ కార్మికులు ఫ్రంట్‌ వారియర్స్‌గా నిలిచారన్నారు. కార్య క్రమంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు తోట రాజశేఖర్‌, బోధన్‌ డివిజన్‌ అధ్యక్షుడు పి.బసవేశ్వరరావు, బోధన్‌ మండలం అధ్యక్షుడు వై.శ్రీనివాస్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా సమన్వయకర్త కొడాలి కిశోర్‌, సొసైటీ ప్రతినిధులు, కౌన్సిలర్లు తూము శరత్‌రెడ్డి, కొత్తపల్లి రాధాకృష్ణ, అబ్దుల్లా, కో-ఆప్షన్‌ సభ్యుడు రుద్ర సత్యనారాయణ పాల్గొన్నారు.