ఆదివారం 29 నవంబర్ 2020
Nizamabad - Oct 22, 2020 , 01:52:33

టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ నేతలు

టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ నేతలు

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో చేరిక

నందిపేట్‌ రూరల్‌ : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. నందిపేట్‌ మండలంలోని వెల్మల్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రామకృష్ణతో పాటు ఇతర నాయకులు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో బుధవారం హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌లో చేరా రు.  ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వాకిడి సంతోష్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌, జడ్పీటీసీ యమున, సర్పంచ్‌ మచ్చర్ల సాయమ్మ, ఉప సర్పంచ్‌ ముప్పెడ నారాయణ, మాజీ ఎంపీటీసీ శ్రీధర్‌, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు తల్వేద రాములు, నాయకులు మచ్చర్ల పెద్ద గంగారాం, ఇతర నాయకులు, గ్రా మస్తులు పాల్గొన్నారు.