బుధవారం 02 డిసెంబర్ 2020
Nizamabad - Oct 21, 2020 , 01:03:27

ఎస్సారెస్పీ నుంచి 25 వేల క్యూసెక్కులు విడుదల

ఎస్సారెస్పీ నుంచి 25 వేల క్యూసెక్కులు విడుదల

మెండోరా : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 68,481 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎనిమిది గేట్లను ఎత్తి 25 వేల క్యూసెక్కులు, ఎస్కేప్‌ గేట్ల నుంచి 5,500 క్యూసెక్కులను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. మిషన్‌ భగీరథ తాగు నీటి కోసం 152 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. కాకతీయ కాలువకు 3 వేలు, సరస్వతీ కాలువకు 500, లక్ష్మీ కాలువకు 150, వరద కాలువకు మూడు వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌ పూర్తి 

స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో నీటిమట్టం 1090.60 అడుగులు (88.60 టీఎంసీల) ఉందని డీఈ జగదీశ్‌ తెలిపారు. ఈ సీజన్‌లో 329.22 టీఎంసీల వరద వచ్చి చేరిందని, మిగులు జలాలు దిగువ గోదావరిలోకి 205.22 టీఎంసీలు వదిలేసినట్లు చెప్పారు.

నిజాంసాగర్‌కు తగ్గిన ఇన్‌ఫ్లో

నిజాంసాగర్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో నీటి విడుదలను మంగళవారం వేకువజామున నిలిపివేశారు. మళ్లీ సాయంత్రం 4,047 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రారంభం కావడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు ఒక వరద గేటు ద్వారా దిగువకు వదులుతున్నట్లు డీఈఈ దత్తాత్రి తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1404.92 అడుగులతో 17.67 టీఎంసీలు ఉన్నట్లు చెప్పారు. సింగూరు ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రానికి 523.555 మీటర్లతో 29.648 టీఎంసీలు ఉందని తెలిపారు. సింగూరు నుంచి 3,304 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్‌కు విడుదల చేస్తున్నారన్నారు.