శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Oct 16, 2020 , 02:14:59

ఆడపడుచుల పెద్దన్న సీఎం కేసీఆర్‌

ఆడపడుచుల పెద్దన్న సీఎం కేసీఆర్‌

  • డీసీసీబీ చైర్మన్‌  పోచారం భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ/బాన్సువాడ రూరల్‌/ బీర్కూర్‌/ నస్రుల్లాబాద్‌ : పండుగలను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని, అందుకే రాష్ట్రంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కోసం చీరెలను పంపిణీ చేస్తూ పెద్దన్నల నిలుస్తున్నారని డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన బతుకమ్మ చీరెలను ఆయన గురువారం బాన్సువాడ పట్టణంలోని రేషన్‌ దుకాణంలో, బాన్సువాడ మండలంలోని కొల్లూర్‌, బీర్కూర్‌లోని గ్రామ పంచాయతీ ఆవరణలో, నస్రుల్లాబాద్‌లోని మండల పరిషత్‌ కార్యాలయంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆడపడుచులకు చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు తెలంగాణ పండుగలను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ అన్ని పండుగలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకునేలా చూస్తున్నారన్నారు. ఎమ్మెల్సీగా కవిత గెలుపునకు కృషి చేసిన బీర్కూర్‌ మండల ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్‌, తహసీల్దార్‌ గంగాధర్‌, ఎంపీడీవో యావర్‌ హుస్సేన్‌ సుఫీ, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, బాన్సువాడ ఏఎంసీ చైర్మన్‌ పాత బాలకృష్ణ, ఎంపీపీ దొడ్ల నీరజ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ అంజిరెడ్డి, కొల్లూర్‌, నాగారం, బీర్కూర్‌ సర్పంచులు తుకారాం, రాచప్ప, సర్పంచ్‌ ఆవారి స్వప్న, నాయకులు నార్ల సురేశ్‌గుప్తా, షేక్‌ జుబేర్‌, పాశం రవీందర్‌రెడ్డి, నార్ల నందకిశోర్‌, బీర్కూర్‌ తహసీల్దార్‌ గణేశ్‌, బీర్కూర్‌ ఏఎంసీ చైర్మన్‌ ద్రోణవల్లి అశోక్‌, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, నస్రుల్లాబాద్‌ తహసీల్దార్‌ ధన్వాల్‌, ఎంపీపీ పాల్త్య విఠల్‌, వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్లు పెర్క శ్రీనివాస్‌, మారుతీ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.