గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Oct 14, 2020 , 01:46:40

ఎస్సారెస్పీకి 1.36 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ఎస్సారెస్పీకి 1.36 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

మెండోరా : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు మంగళవారం ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,36,443 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోందని డీఈ జగదీశ్‌ తెలిపారు. 30 గేట్ల ద్వారా 1,25,000 క్యూసెక్కులను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఎస్కేప్‌ గేట్ల నుంచి 3,500, కాకతీయ కాలువకు 3 వేలు, వరద కాలువకు 3 వేలు, లక్ష్మీ కాలువకు 300, సరస్వతీ కాలువకు 800 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతోంది. 

నిజాంసాగర్‌లోకి ఇన్‌ఫ్లో

నిజాంసాగర్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 1,824 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోందని డీఈఈ దత్తాద్రి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1398.00 అడుగులతో (9.32 టీఎంసీల) నీరు నిలువ ఉన్నట్లు చెప్పారు. కౌలాస్‌నాలా ప్రాజెక్టులోకి 574 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు ఏఈ రాజ్‌కమల్‌ తెలిపారు. 

పోచారంలోకి 2,138 క్యూసెక్కులు

నాగిరెడ్డిపేట్‌ : మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి 2,138 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టు నుంచి 2,098 క్యూసెక్కుల నీరు మత్తడి దుంకుతోంది. 

గోదావరి నదిలో పెరుగుతున్న నీటిమట్టం 

రెంజల్‌ : తెలంగాణ  మహారాష్ట్ర సరిహద్దులోని రెంజల్‌ మండలం కందకుర్తి వద్ద గోదావరి నదిలో వరదనీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 


logo