సోమవారం 19 అక్టోబర్ 2020
Nizamabad - Oct 12, 2020 , 03:37:35

అప్రమత్తంగా ఉండండి..

అప్రమత్తంగా ఉండండి..

  • కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ ఆదేశం
  • రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
  • అధికార యంత్రాంగం అలర్ట్‌

ఖలీల్‌వాడి/విద్యానగర్‌ : రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో చాలా చోట్ల ఆదివారం వర్షాలు కురిశాయని, సోమ, మంగళవారాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ఎప్పటికప్పడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 


logo