గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Oct 12, 2020 , 03:37:35

ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి

ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి

  • కౌంటింగ్‌ అధికారులకు శిక్షణలో కలెక్టర్‌ నారాయణరెడ్డి 

ఇందూరు : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈ నెల 9న పోలింగ్‌ నిర్వహించగా, నేడు (సోమవారం) కౌంటింగ్‌ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులకు పాలిటెక్నిక్‌ కళాశాలలో ఆదివారం  శిక్షణ కార్యక్రమం ఏర్పా టు చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సి.నారాయణరెడ్డి హాజరై పలు సూచనలు చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కౌం టింగ్‌ సూపర్‌వైజర్లు ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.  ప్రతి విషయంలో క్లారిటీతో ఉండాలని, ఎటువంటి సందేహాలున్నా తమను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. నిబంధనలకనుగుణంగా కౌంటిం గ్‌ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. అనంతరం కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్‌, ఏవో సుదర్శన్‌  పాల్గొన్నారు. 


logo