బుధవారం 21 అక్టోబర్ 2020
Nizamabad - Oct 11, 2020 , 06:21:57

పిడుగుపాటుకు బాలుడి మృతి

 పిడుగుపాటుకు బాలుడి మృతి

ఎల్లారెడ్డి: మేకలను మేపేందుకు వెళ్లిన ఇద్దరు అన్నాదమ్ములు పిడుగుపాటుకు గురయ్యారు. ఈ ఘటనలో తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందగా అన్నకు తీవ్రగాయాలయ్యాయి. ఎల్లారెడ్డి మండలంలోని అడవిలింగాల తండా శివారులో శనివారం ఈ ఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. అడవిలింగాల తండాకు చెందిన ధనావత్‌ బాల్యా, బుడ్డిబాయి కుమారులు వినయ్‌(13), సుమన్‌ (17) శనివారం మేకలను మేపేందుకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో వారిద్దరూ దగ్గరలోని చెట్టుకిందికి వెళ్లి నిల్చున్నారు. ఆ సమయంలో పిడుగుపడడంతో వినయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సుమన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సుమన్‌ను ఎల్లారెడ్డిలోని ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. వినయ్‌ మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. రెసిడెన్షియల్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వినయ్‌ స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఒక కుమారుడు మృతి చెందడం, మరో కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో తల్లిదండ్రులు    తల్ల్లడిల్లిపోతున్నారు. logo