గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Oct 09, 2020 , 05:35:12

సిబ్బంది కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

సిబ్బంది కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

  • కలెక్టర్‌ నారాయణరెడ్డి
  • ఎన్నికల అబ్జర్వర్‌తో కలిసి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ పరిశీలన

నిజామాబాద్‌ సిటీ : ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికా రులు సర్వం సిద్ధం చేశారు. పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో గురువా రం సిబ్బందికి పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికల పర్యవేక్షకుడు వీరబ్రహ్మయ్య, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను పరిశీలించారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రిసైడింగ్‌ అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌, కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సామగ్రి పంపిణీ చేస్తున్నట్లు తెలిపా రు.  ప్రతి పోలింగ్‌ అధికారి తప్పనిసరిగా మాస్కు, గ్లౌజ్‌, ఫేస్‌షీల్డ్‌ ధరించాలన్నారు. హెల్ప్‌డెస్క్‌ వద్ద వెయిటింగ్‌ హాల్‌లో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. కొవిడ్‌ నియంత్రణకు సంబంధించిన సూచనల  ఫ్లెక్సీలను ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో ఓటు వేయడానికి వచ్చే వారికి కనిపించేలా  ఏర్పాటు చేయాలని తెలిపారు. ఐడెంటీ ఫ్లయింగ్‌ అధికారిగా ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్‌ ఉంటారన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదన్నారు. పోలింగ్‌ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగు తుందని వివరించారు. 50 పోలింగ్‌ స్టేషన్లను 15 రూట్లుగా విభజించడం జరిగిందని, ప్రతి రూట్‌కు ఒక సెక్టోరియల్‌ అధికారిని నియమించామని, కొ విడ్‌ ప్రొటోకల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని  ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసిందన్నారు. కొవిడ్‌ పేషెంట్‌ ఇంటి దగ్గర నుంచి అంబులెన్స్‌ లేదా తమ సొంత వాహనంలో రావచ్చని అన్నా రు. మెడికల్‌ ఆఫీసర్‌, ఏఎన్‌ఎంలు, హెల్ప్‌డెస్క్‌ దగ్గర ఉంటారని తెలిపారు. 

జడ్పీలో పూర్తయిన ఏర్పాట్లు

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా పరిషత్‌ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయమే పాలిటెక్నిక్‌ కళాశాల నుంచి ఎన్నికల సామగ్రితో అధికారులు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నా రు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓటరుకు ఎలాంటి ఇబ్బం ది లేకుండా వసతులు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.  


logo