మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Oct 07, 2020 , 00:48:20

సన్నరకం ధాన్యానికి మద్దతు ధర పెంచాలి

సన్నరకం ధాన్యానికి మద్దతు ధర పెంచాలి

డిచ్‌పల్లి : సన్నరకం ధాన్యానికి మద్దతు ధరను పెంచాలని రూరల్‌ నియోజకవర్గ సొసైటీ చైర్మన్లు కోరారు. ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ సాంబారి మోహన్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాజిరెడ్డిని హైదరాబాద్‌లో మంగళవారం కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా చైర్మన్లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈసారి వానకాలం సీజన్‌లో రైతులు ఎక్కువగా సన్నరకం వరి పంటను సాగు చేశారని తెలిపారు. ఇందుకోసం పెట్టుబడి ఖర్చులు పెరిగినందున రైతులకు గిట్టుబాటు కలిగేలా మద్దతు ధర పెంచేలా చూడాలని కోరారు.  గత యాసంగిలో సొసైటీ తరఫున కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించినప్పుడు కడ్తా తీశారని, దీంతో రైతులు నష్టపోయారని తెలిపారు. కడ్తా తీయకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ.. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నుంచి ఎస్‌ఏవో రుణాలు, సన్నరకానికి మద్దతు ధర పెంచేవిషయం సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు.  ఇతర సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో డీసీసీబీ డైరెక్టర్‌ శేఖర్‌రెడ్డి, సొసైటీల చైర్మన్లు గజవాడ జైపాల్‌, గోవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చిన్నారెడ్డి, దాసరి శ్రీధర్‌,  స్వామి, మాధవ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

చాంద్రాయన్‌పల్లికి కాళేశ్వరం నీరందించాలి..

ఇందల్వాయి: మండలంలోని చాంద్రాయాన్‌పల్లికి కాళేశ్వరం ద్వారా సాగునీటిని అందించాలని, సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయించాలని గ్రామస్తులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను కోరారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో మంగళవారం కలిసి గ్రామంలోని సమస్యలను విన్నవించారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి గ్రామాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో ఎంపీపీ రమేశ్‌నాయక్‌, ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ సాంబారి మోహన్‌, వైస్‌ ఎంపీపీ అంజయ్య, ఉపసర్పంచ్‌ ప్రకాశ్‌, వీడీసీ చైర్మన్‌ నవీన్‌గౌడ్‌తోపాటు టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు రఘు, వీడీసీ సభ్యులు, నాయకులు ఉన్నారు. logo