గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Oct 06, 2020 , 01:42:58

ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం

ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం

ఇందూరు : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన ఎ న్నికల కౌంటింగ్‌ శిక్షణను  కలెక్టర్‌ నారాయణరెడ్డి సో మవారం పరిశీలించారు. ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో కౌంటింగ్‌ సూపర్‌వైజ ర్లు, కౌంటింగ్‌ అసిస్టెం ట్లు, మైక్రో అబ్జర్వర్లకు ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ శిక్షణలో పాల్గొని  కలెక్టర్‌ పలు సూచనలు, ఆదేశాలు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కావడానికి 48 గంటల ముందు వరకు అనగా 7వ తేదీ ఉదయం 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 65 సంవత్సరాలు పైబడిన వారు, కొవిడ్‌ పాజిటివ్‌ పేషెంట్లు, హోంఐసొలేషన్‌లో ఉన్నవారు, దివ్యాంగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేశామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఓటరు కార్డు, ఓటరు లిస్టులో పేరు, సీరియల్‌ నంబర్‌ తదితర వివరాలతో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రేపటి నుంచి సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్ల ద్వారా ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తామని తెలిపారు.  అనంతరం ఎన్నికల కౌంటింగ్‌ సెంటర్‌, స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించారు. శిక్షణా శిబిరంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్డీవో రవి, ట్రైనర్‌ బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌, ఏవో  సుదర్శన్‌ పాల్గొన్నారు. 


logo