గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Oct 05, 2020 , 03:41:58

కవితతో బోధన్‌ ఎమ్మెల్యే భేటీ

కవితతో బోధన్‌ ఎమ్మెల్యే భేటీ

బోధన్‌: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌  అభ్యర్థి కల్వకుంట్ల కవితను బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ ఆదివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోధన్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లంతా ఏకపక్షంగా కవితకు ఓట్లు వేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిపక్షాల అభ్యర్థులకు కనీస మద్దతు కూడా లభించడంలేదని చెబుతూ నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులను ఆమెకు వివరించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే వెంట ఆయన సోదరుడు, బోధన్‌ మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ ఎతెహేషాం (సోహైల్‌), మున్సిపల్‌ కౌన్సిలర్‌ తూము శరత్‌రెడ్డి ఉన్నారు. 


logo