శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Oct 04, 2020 , 00:17:24

ఎమ్మెల్సీ అభ్యర్థి కవితకు మద్దతుగా తీర్మానాలు

ఎమ్మెల్సీ అభ్యర్థి కవితకు మద్దతుగా తీర్మానాలు

బోధన్‌/ వేల్పూర్‌/ రామారెడ్డి/గాంధారి: నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు ప్రజాప్రతినిధులు మద్దతు ప్రకటిస్తున్నారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీలు కవితకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఎమ్మెల్యే మహ్మద్‌షకీల్‌ను కలిసి తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుద్దె సావిత్రి, జడ్పీటీసీ లక్ష్మీ గిర్దావార్‌ గంగారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంజీవ్‌కుమార్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు  బుద్దె రాజేశ్వర్‌, ఎంపీటీసీ సభ్యులు సవిత, పద్మ, జయశ్రీ, వెంకట్‌రావు,అంజమ్మ, ప్రభాకర్‌, భూమారెడ్డి, శివకుమార్‌, వెంకట్‌, హన్మంతు ఉన్నారు. 

వేల్పూర్‌ మండలంలోని ప్రజాప్రతినిధులు కవితకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు తీర్మాన పత్రాన్ని టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ నాగధర్‌కు అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రామారెడ్డి మండలంలోని ఎంపీటీసీలు కవితకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు ఎంపీపీ దశరథ్‌రెడ్డికి తీర్మాన పత్రాన్ని అందజేశారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు  గోపాల్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవితను భారీ మెజార్టీతో గెలిపిస్తామని గాంధారి ఎంపీపీ రాధాబలరాం, ఏఎంసీ చైర్మన్‌ పెద్దబూరి సత్యం అన్నారు. మండలంలోని అన్నిగ్రామాలకు చెందిన ఎంపీటీసీలు శనివారం మండల కేంద్రం లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ, ఏఎంసీ చైర్మన్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. అనంతరం కవితను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రమాణం చేశారు.  సమావేశంలో వైస్‌ ఎంపీపీ భజన్‌లాల్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ వంజరి శంకర్‌, ఎంపీటీసీలు బూస సారిక, ఉమారాణి, మణి సురేశ్‌, పీర్యానాయక్‌ పాల్గొన్నారు.


logo