శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Oct 02, 2020 , 02:30:25

బెట్టు మీద బెట్టు!

బెట్టు మీద బెట్టు!

క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని ఆసరాగా చేసుకున్న బుకీలు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లను ప్రోత్సహిస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. పది రోజుల క్రితమే ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభమైంది. దీంతో బుకీలు ఈజీ మనీ ఆశ చూపి యువతను తమవైపు తిప్పుకుంటున్నారు. జట్టు గెలుపోటములతోపాటు ‘బాల్‌ టు బాల్‌' పందేలు కాస్తున్నారు. అత్యాశకు పోతున్న యువకులు బెట్టింగులతో తీవ్రంగా నష్టపోతున్నారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, గాంధారితోపాటు పలు మండలాల్లో  బెట్టింగులు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌లకు సంబంధించి స్థానికంగా ఉండే వ్యక్తులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తుండగా, వారికి ప్రతి బెట్టింగ్‌ నుంచి పదిశాతం కమీషన్‌ అందుతోందని సమాచారం.

ఎల్లారెడ్డి : ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభ మైంది. దీంతో బెట్టింగులు సైతం జోరందుకున్నాయి. పది రోజుల క్రి తం ప్రారంభమైన ఐపీఎల్‌ క్రికెట్‌ పో టీలపై ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ప్రతి రోజూ కోట్లాది రూపాయల బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా యువకులు, బడా వ్యాపారులు, పలువురు రాజకీయ నాయకులు బెట్టింగుల్లో లీనమవుతున్నట్లు సమాచారం. నిజామాబాద్‌తో పాటు ఆర్మూర్‌, భీమ్‌గల్‌, కామారెడ్డి, బోధ న్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి, గాంధారిలో చాలా మంది యువకులు ఐపీఎల్‌ మ్యాచులపై పందేలు కాస్తున్నారు. మ్యాచ్‌ ప్రారంభం నుంచి గెలుపోటములు, వికెట్లు, మొదటి ఆ రు ఓవర్లు, బౌలింగ్‌లో ప్రతి బాల్‌పైనా పందెం కాస్తున్నట్లు తెలుస్తున్నది.  

మ్యాచ్‌ టు మ్యాచ్‌పై ఎక్కవగా పందెం...

ఐపీఎల్‌ మ్యాచులు సెప్టెంబర్‌ 19న ప్రారంభమయ్యాయి. ప్రతి రోజూ ఆట ప్రారంభంలోనే మ్యాచ్‌ టు మ్యాచ్‌ పందెం కాస్తున్నారు యవకులు. రెండు జట్ల మధ్య జరుగనున్న పోటీలో ఏ జట్టు గెలుస్తుందనే దానిపై  రూ.వెయ్యి నుంచి రూ. 20 వేల వరకు పందెం కాస్తున్నారు. పందెంలో గెలిస్తే రెట్టింపు డబ్బులు వస్తాయని  యువకులు దీనిపై ఆసక్తి చూపి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆట ప్రారంభంలో ఏ జట్టు గెలుస్తుందనే విషయమై బుకీలతో మాట్లాడి వారి అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తారు. మ్యాచ్‌ పూర్తయ్యాక పందెం కాసిన జట్టు గెలిస్తే రెట్టింపు డబ్బులు అతని అకౌంట్‌లోకి నేరుగా వచ్చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మ్యాచ్‌ గెలుపోటములపై రెండు, మూడు రెట్లు కూడా చెల్లిస్తున్నారు. దీంతో క్రికెట్‌పై మోజు ఉన్న వారు బెట్టింగులతో వేల నుంచి లక్షల రూపాయలు పందెం కాసి నష్టపోతున్నారు.

ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా పందెం...

క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్న ప్రతి రోజూ ఆన్‌లైన్‌లో పందెం కాసే వారు ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలోనే ఉన్నట్లు తెలస్తున్నది. నిజామాబాద్‌లో సుమారు వెయ్యిమందికి పైగా ఉండగా కామారెడ్డిలోనే నాలుగైదు వందల మంది ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో పందెం కాసే వారు మ్యాచ్‌ను చూస్తూ ప్రతి ఓవర్‌, బాల్‌ల పరిస్థితిపై బెట్టింగ్‌ చేస్తారు. దీనికి మధ్యవర్తులు ఉంటారు. మంచి బౌలర్ల బౌలింగ్‌లో వికెట్ల గురించి బెట్టింగులు జరుగుతున్నాయి. బ్యాట్స్‌మెన్‌ల తీరుపైనా ప్రతి బాల్‌కి 4, 6 కొడతారనే విషయంలోనూ బెట్టింగులు జరుగుతున్నాయి. కామారెడ్డిలో కొందరు యువకులు ప్రత్యేకంగా గది తీసుకొని అదే పనిగా బెట్టింగులు కడుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. 

మధ్యవర్తికి పది శాతం వరకు కమీషన్‌...

మ్యాచ్‌లకు సంబంధించి స్థానికంగా ఉండే ఒకరు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. వీరికి ప్రతి బెట్టింగ్‌ డబ్బు నుంచి పది శాతం వరకు కమీషన్‌ ఉంటుంది. దీంతో మధ్యవర్తులు బెట్టింగ్‌ కోసం కొంతమందిని ప్రోత్సహిస్తున్నట్లు సమా చారం. కామారెడ్డి, నిజామాబాద్‌, ఆర్మూర్‌ తదితర ప్రాంతాల్లో వీరు చాలా మంది ఉన్నట్లు తెలుస్తున్నది. బెట్టింగ్‌ డబ్బుల చెల్లింపు వ్యవహారం అంతా గూగుల్‌పే, ఫోన్‌పే, అమెజాన్‌పేల ద్వారానే జరుగుతున్నాయి. మ్యాచ్‌ ప్రారంభంలో డబ్బు లు మధ్యవర్తి చెప్పిన ఖాతాలో జమ చేస్తే వారికి చెల్లింపులు మాత్రం మరో ఖాతా నుంచి వస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. మధ్యవర్తుల ఆదా యం సైతం రోజుకు లక్ష వరకు ఉం టుందని సమాచారం.

తొలిరోజే పట్టుబడిన బెట్టింగ్‌ గ్యాంగ్‌

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఐపీఎల్‌ మ్యాచులు ప్రారంభమైన తొలిరోజే బెట్టింగ్‌ గ్యాంగ్‌ పట్టుబడడం చర్చనీయాంశమైంది. జిల్లా కేంద్రంలో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.  


logo