బుధవారం 28 అక్టోబర్ 2020
Nizamabad - Sep 29, 2020 , 02:10:41

తహసీల్‌ ఎదుట నర్సింగ్‌పల్లి గ్రామస్తుల ధర్నా

తహసీల్‌ ఎదుట నర్సింగ్‌పల్లి గ్రామస్తుల ధర్నా

నిజామాబాద్‌ రూరల్‌ (మోపాల్‌) : తమ గ్రామ శివారులోని భూమిని కాస్‌బాగ్‌తండా గ్రామ పల్లె ప్రకృతివనం ఏర్పాటుకు కేటాయించడాన్ని నిరసిస్తూ మోపాల్‌ మండలంలోని నర్సింగ్‌పల్లి గ్రామస్తులు తహసీల్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. 

భవిష్యత్‌లో ఆ భూమి గ్రామాభివృద్ధి పనుల కోసం వినియోగించేందుకు ఉపయోగపడుతుందని సర్పంచ్‌ సాయిరెడ్డి, ఎంపీటీసీ రాములు, వీడీసీ ప్రతినిధులు పేర్కొన్నారు. కాస్‌బాగ్‌తండా గ్రామశివారులోఉన్న భూమిని విలేజ్‌పార్కు కోసం కేటాయించుకోవాలని అన్నారు. తమ గ్రామ శివారులోని భూమి తమ గ్రామానికి చెందేవిధంగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఐక్యంగా ఆందోళనలు చేపడుతామని అన్నారు. రెవెన్యూ అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగడంతో ఎస్సై పూర్ణేశ్వర్‌ తహసీల్‌ కార్యాలయానికి చేరుకొని వారిని సముదాయించారు. 


logo