మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Sep 24, 2020 , 01:38:59

‘సాగర్‌'కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

‘సాగర్‌'కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

  • పొంగిపొర్లుతున్న సింగీతం, నల్లవాగు

నిజాంసాగర్‌: మండలంలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో రోజురోజుకూ నీటిమట్టం పెరుగుతున్నది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1393.50 అడుగుల(5.85 టీఎంసీల) నీరు నిలువ ఉంది. 3,736 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  వచ్చి చేరుతున్నట్లు నీటి పారుదల శాఖ డీఈఈ దత్తాద్రి తెలిపారు. 

సింగీతం ప్రాజెక్టు ప్రస్తుతం 416.500 మీటర్ల పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండి ఉండగా ఎగువ నుంచి 1800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. 660 క్యూసెక్కుల నీటిని మూడు వరద గేట్ల ద్వారా నిజాంసాగర్‌ ప్రధాన కాలువకు విడుదల చేస్తున్నారు. 1140 క్యూసెక్కుల నీరు సింగీతం అలుగు ద్వారా మంజీరలోకి పరవళ్లు తొక్కుతున్నది. నల్లవాగు మత్తడి పొంగిపొర్లుతుండడంతో మంజీర జలకళను సంతరించుకుంది. జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టులో 458.00 అడుగుల(1.237 టీంఎసీల) నీరు నిలువ ఉండగా ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 2204 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. అంతే స్థాయిలో రెండు వరద గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏఈ రాజ్‌కమల్‌ తెలిపారు. 


logo