సోమవారం 19 అక్టోబర్ 2020
Nizamabad - Sep 23, 2020 , 01:57:03

వడివడిగా విద్యుదుత్పత్తి

వడివడిగా విద్యుదుత్పత్తి

  • l50 మిలియన్‌ యూనిట్లు లక్ష్యం
  • lఇప్పటికే 23 మిలియన్‌ యూనిట్లు పూర్తి
  • lపూర్తిస్థాయిలో  కొనసాగుతున్న విద్యుదుత్పత్తి

కమ్మర్‌పల్లి : ఎస్సారెస్పీలో ఈ ఆర్థిక సంవత్సరం విద్యుదుత్పత్తి ఆశాజనకంగా సాగుతోంది. ఎస్సారెస్పీకి భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతుండడం, వరద ఉధృతి బాగా ఉండడంతో ఎస్సారెస్పీలో జెన్‌కో ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం మేరకు విద్యుత్‌ ఉత్పత్తి సాధించనుం ది. మరింత కాలం ప్రాజెక్టులోకి వరద కొనసాగే అవకాశం ఉండడంతో లక్ష్యం మేరకు విద్యుదుత్పత్తి జరుగుతుందనే భరోసా నెలకొంది. ఎస్సారెస్పీలో ఈ ఆర్థిక సంవత్సరం విద్యుదుత్పత్తి లక్ష్యం 50 మిలియన్‌ యూనిట్లు. ఈసారి గత సీజన్‌ కన్నా ముందుగానే ప్రాజెక్టులోకి భారీ వరదలు ప్రారంభమయ్యాయి. దీంతో ఎస్సారెస్పీలో విద్యుదుత్పత్తి జోరందుకున్నది. ఎస్సారెస్పీలో విద్యుదుత్పత్తికి నాలుగు టర్బయిన్లు ఉన్నాయి. ఒక్కో టర్బయిన్‌ ఉత్పత్తి సా మర్థ్యం తొమ్మిది మెగావాట్లు. వారం రోజులుగా నాలుగు టర్బయిన్ల ద్వారా 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతున్నది. నీటి ప్రవాహ వేగంపై వీటి పూర్తిస్థాయి ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. ఒక టర్బయిన్‌ ద్వారా విద్యుదుత్పత్తికి 1800 నుంచి 2000 క్యూసెక్కుల ప్రవాహం అవసరమవుతుంది. నాలుగు టర్బయిన్లు పనిచేయడానికి తొమ్మిది వేల క్యూసెక్కుల ప్రవాహం అవసరం. కొద్ది రోజులుగా 75 వేల క్యూసెక్కుల నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో నమోదయ్యింది. వరద ఉధృతి బాగా కొనసాగుతూ ఉంది. ఈ నెల 14న గోదావరిలోకి నీటి విడుదల ప్రారంభించారు. దీంతో వారం రోజులుగా నాలుగు టర్బయిన్ల ద్వారా పూర్తిస్థాయిలో 36 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతున్నది. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సోమవారం ఉదయం వరకు 23 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. వానకాలం సీజన్‌ ఇంకా మిగిలి ఉన్నందున ఇటు ప్రాజెక్టుకు అక్టోబర్‌ 28 వరకు ఇన్‌ఫ్లో కొనసాగే అవకాశం ఉంది. మిగతా 27 మిలియన్‌ యూ నిట్ల ఉత్పత్తికి ఢోకా లేదని జెన్‌కో అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ప్రాజెక్టు ఎస్కేప్‌ గేట్లు మ్యానువల్‌గా ఉండేవి. వీటిని ఆధునీకరించడంతో గడిచిన రెండు సీజన్ల నుంచి ఎస్కేప్‌ గేట్ల ద్వారా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు నీటి విడుదల సమయంలోనే కాకుండా ఎస్కేప్‌ గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల చేస్తుండడంతో ఈ ఆర్థిక సంవత్సరం విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడుతున్నది. logo