గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Sep 23, 2020 , 01:57:04

‘గిసొంటి సర్కార్‌ను ఎప్పుడూ సూడలే’

‘గిసొంటి సర్కార్‌ను ఎప్పుడూ సూడలే’

  • lకేసీఆర్‌ సార్‌ ఇచ్చిన గొర్రెలతోనే బతుకుతున్నా..
  • lఅప్పుడిచ్చిన గొర్రెలు ఇప్పుడు మూడింతలైనయ్‌
  • lగొర్రెల కాపరి పాలెపు భూమన్న

ధర్పల్లి : ‘గిసొంటి సర్కార్‌ను ఎప్పుడూ సూడలే.. సీఎం కేసీఆర్‌ సార్‌ ఇచ్చిన గొర్రెలపైనే ఆధారపడి మా కుటుంబ బతుకుతున్నది..” అని అంటున్నాడు మండల కేంద్రానికి చెందిన పాలెపు భూమన్న. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మొదటివిడుతలో భూమన్న 20 గొర్రెలు, ఒక పొట్టేలును ప్రభుత్వం అందజేసింది. అప్పటి నుంచి వాటిని మేపుకొంటూ జీవిస్తున్నాడు. చేతికి వచ్చిన కొడుకు మృతి చెందినా ప్రభుత్వం అందజేసిన గొర్రెలు మేపుతూ కోడలితోపాటు ఇద్దరు కూతుళ్లను పోషిస్తున్నాడు. 

20 గొర్రెలు 60 అయ్యాయి..

ప్రభుత్వం ఒక్కొక్కరికి 20 గొర్రెలు పంపిణీ చేస్తే ఇప్పుడు వాటి సంఖ్య 60కి చేరింది. గొర్రెల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్న భూమన్న కొన్నింటిని విక్రయించగా, ప్రస్తుతం 45 వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న గొర్రెలు పిల్లలు చేస్తే మళ్లీ తన దగ్గర ఉన్న జీవాల సంఖ్య పెరుగుతుందని, అవసరాన్ని బట్టి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటానని తెలిపాడు. తమ కులవృత్తిని కాపాడడంతోపాటు జీవనోపాధిని కల్పించిన కేసీఆర్‌ సార్‌కు రుణపడి ఉంటానని భూమన్న అంటున్నాడు.

బతుకుదోవ సూపిస్తుండు..

కేసీఆర్‌ సారు అందరికీ బతుకుదోవ సూపిస్తుండు. గిసొంటి సారు వందేండ్లు బతకాలే. ముసలోల్లకు పింఛన్లు, మాకు గొర్రెలు, ఎవుసం జేసుకునెటోళ్లకు పెట్టుబడి ఇయ్యవట్టే. ఆయన మంచిగుంటనే మాయసుంటోళ్లు మంచిగుంటరు. ఆయనకు రెండు చేతులెత్తి మొక్కుతున్నా..

-పాలెపు భూమన్న, ధర్పల్లి


logo