ఆదివారం 25 అక్టోబర్ 2020
Nizamabad - Sep 22, 2020 , 02:14:36

వైకుంఠధామాల్లో మొక్కలు నాటాలి

వైకుంఠధామాల్లో మొక్కలు నాటాలి

మోర్తాడ్‌/ఆర్మూర్‌/చందూర్‌: గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాల్లో మొక్కలు నాటాలని మోర్తాడ్‌ ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని వైకుంఠధామం, కంపోస్ట్‌షెడ్డు పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైకుంఠధామాల్లో ప్రహరీ వెంట పొడవుగా పెరిగే చెట్లు, ఆవరణలో పూల మొక్కలను పెంచాలని సూచించారు. కంపోస్ట్‌ షెడ్లలో కంపోస్టు తయారీని ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఆర్మూర్‌ మండలంలోని ఖానాపూర్‌ పల్లెప్రకృతివనంలో సర్పంచ్‌ సింగిరెడ్డి మోహన్‌ మొక్కలు నాటారు. టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు బండి రవి, నాయకులు పల్లపు మోహన్‌, సుంకరి వినోద్‌, సుధాచారి, సంతోష్‌, దాసు, రాజు తదితరులు పాల్గొన్నారు.   చందూర్‌ మండలంలోని లక్ష్మాపూర్‌, కారేంగాం, మేడిపల్లి, చందూర్‌లో అభివృద్ధి పనులను ఎంపీడీవో లీలావతి పరిశీలించారు. గ్రామాల్లోని నర్సరీలను, వైకుంఠధామాలు తదితర పనులను పరిశీలించారు. అవకతవకలు జరిగితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీవో తారాచందర్‌, ఏపీవో దేవీసింగ్‌, కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు. 

పల్లెల్లో మినీ పార్కులపై ప్రత్యేక శ్రద్ధ.. 

ఆర్మూర్‌: రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్‌, ఉన్నతాధికారులు పల్లెల్లోని మినీ పార్కుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎంపీపీ పస్క నర్సయ్య అన్నారు. మండలంలోని చేపూర్‌ గ్రామంలో కొనసాగుతున్న మినీ పార్కు పనులను ఎంపీడీవో, పీఆర్‌ ఏఈ, సర్పంచులతో కలిసి సో మవారం ఎంపీపీ పరిశీలించారు. అనంతరం గ్రామం లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆదేశాల మేరకు సీసీ రోడ్డు వేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సర్వే నిర్వహించారు. ఆర్మూర్‌ ఎంపీడీవో గోపీబాబు, పీఆర్‌ ఏఈ నితి న్‌, చేపూర్‌ సర్పంచ్‌ సాయన్న, జీపీ కార్యదర్శి రాహుల్‌, నాయకులు రాజు, నాగరాజు పాల్గొన్నారు.logo