శనివారం 31 అక్టోబర్ 2020
Nizamabad - Sep 15, 2020 , 02:59:35

రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు

రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు

  • కాంగ్రెస్‌ నాయకుల తీరుపై డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ ధ్వజం

వేల్పూర్‌ : రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్‌ నాయకులు ప్రభుత్వంపై బురదజల్లే ఆరోపణలు చేస్తున్నారని డీసీసీబీ వైస్‌చైర్మన్‌ కుంట రమేశ్‌రెడ్డి అన్నారు. వేల్పూర్‌లో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నదని, గత వానకాలం సీజన్‌లో జిల్లాలో 5లక్షల 79వేల35 క్వింటళ్ల మక్కలను ప్రభుత్వ మే కొనుగోలు చేసిందని తెలిపారు. పంటల సాగుకు ముందే రైతులకు అన్ని విధాలుగా అవగాహన కల్పిస్తు న్నారని చెప్పారు. సోయా పంటకు గతేడాది కన్నా ఈ సంవత్సరం క్వింటాలుకు రూ.500 ధర ఎక్కువగా ఉందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ రైతులను పట్టించుకున్న పాపాన పోలే దన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ నాగధర్‌, ఎంపీపీ భీమ జమున, వైస్‌ ఎంపీపీ బోదపల్లి సురేశ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, సర్పంచులు రాజేశ్వర్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్‌, రాజేశ్వర్‌, ప్రతి రాజేశ్వ ర్‌, రాజ్‌కుమార్‌, నితీశ్‌ కుమార్‌, శ్యామ్‌రావు ఉన్నారు.