శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Sep 14, 2020 , 01:03:26

కొనసాగుతున్న కరోనా పరీక్షలు

కొనసాగుతున్న కరోనా పరీక్షలు

నమస్తే తెలంగాణ యంత్రాంగం : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, జలుబు ఉన్న వారు పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని తెలిపారు. కరోనా పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన టెస్టులు, పాజిటివ్‌ కేసుల వివరాలను వైద్యులు వెల్లడించారు. పాజిటివ్‌  వచ్చిన వారికి వైద్యశాఖ అధికారులు ఐసొలేషన్‌ కిట్లను అందజేశారు. బోధన్‌ పట్టణంలోని రాకాసీపేట్‌ ఏరియాలో 24 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి, పాన్‌గల్లీ ఏరియాలో 13 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. ఆర్మూర్‌ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా 17 మందికి పాజిటివ్‌ వచ్చింది. మోస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 25 మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. రెంజల్‌ మండలంలో ఆదివారం నాటికి 170 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మోర్తాడ్‌ మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో 21 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. కమ్మర్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో ఏడుగురికి టెస్టులు చేయగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది.