బుధవారం 21 అక్టోబర్ 2020
Nizamabad - Sep 14, 2020 , 00:57:37

టోల్‌ప్లాజా వద్ద లారీ బీభత్సం

టోల్‌ప్లాజా వద్ద లారీ బీభత్సం

ఇందల్వాయి: ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న టోల్‌ప్లాజా వద్ద ఓ లారీ డివైడర్‌తోపాటు రెండు కార్లను ఢీకొనడంతో కార్లు ధ్వంసమైనట్లు ఎస్సై శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ వెళ్తున్న లారీ బ్రేకులు టోల్‌ ప్లాజా వద్ద ఫెయిలయ్యాయి. దీంతో డివైడర్‌ను ఢీకొట్టుకుంటూ ముందున్న రెండు కార్లు, ఒక టాటా ఏస్‌ వాహనాల పైకి దూసుకెళ్లింది. దీంతో వాహనాలు ధ్వంసమయ్యాయని ఎస్సై పేర్కొన్నారు. కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. logo