శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Sep 13, 2020 , 02:22:31

కల్యాణలక్ష్మితో ఆడబిడ్డలకు భరోసా

కల్యాణలక్ష్మితో ఆడబిడ్డలకు భరోసా

  • ఎల్లారెడ్డి ఎమ్మెల్యే  నల్లమడుగు సురేందర్‌

తాడ్వాయి (లింగంపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపిల్లకు భరోసా   కల్పిస్తున్నదని ఎల్లారె డ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్‌ అన్నారు.  తాడ్వాయి మం డల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్న త పాఠశాలలో  లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను శనివా రం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధం గా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి నిధులను విడుదల చేయాలని కోరిన వెం టనే సీఎం కేసీఆర్‌, రూ.10 కోట్లు విడుదల చేశారని అన్నా రు. తాడ్వాయి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 167 మంది లబ్ధ్దిదారులకు రూ. కోటీ 67లక్షలు మంజూరైనట్లు ఆయ న తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులతోపాటు చీర అందించడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. నూతన రెవెన్యూ చట్టంతో రైతుల భూములకు రక్ష ణ ఏర్పడిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కౌడి రవి, జడ్పీటీసీ రమాదేవి, సర్పంచ్‌ సంజీవులు, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ కపిల్‌రెడ్డి, సీడీసీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు ముదాం నర్సింహులు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పుల్గం సాయిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. logo