శనివారం 31 అక్టోబర్ 2020
Nizamabad - Sep 07, 2020 , 01:45:04

అర్వింద్‌వి అవకాశవాద రాజకీయాలు

అర్వింద్‌వి అవకాశవాద రాజకీయాలు

  • డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రమేశ్‌రెడ్డి 

ఇందూరు : ఎంపీ అర్వింద్‌వి అవకాశవాద రాజకీయాలని,   ఉనికి కోసం అసత్య ఆరోపణలతో రాజకీయ విలువలను కాలరాస్తున్నాడని డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రమేశ్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లలో మక్కజొన్నకు మద్దతు ధర రూ.2,300 ధర మాత్రమే ఉందని ఎంపీ మాయమాటలు చెబుతున్నాడ న్నారు. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి రైతులు రూ.2వేలకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, బయట మార్కెట్‌లో రూ.2,300లకు అమ్ముకోవచ్చని సలహానిచ్చారు. యూరియా కేటాయింపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, రాష్ర్టానికి రావాల్సిన యూరియా కోటాలో కేంద్రం 30శాతం తక్కువగా కేటాయించిందన్నారు. సీఎం కేసీఆర్‌, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, రోడ్లు భవనాలు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిరంతరం యూరియా కేటాయింపు గురించి కేంద్రంతో సంప్రదిస్తున్నారన్నారు. కానీ ఆగస్టు నెలలో 70 శాతం మాత్రమే పంపారని, సెప్టెంబర్‌ నెల ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా ఒక్క వ్యాగిన్‌ కూడా  జిల్లాకు కేటాయించలేదన్నారు. కేంద్రం బీజేపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి జిల్లా రైతుల మీద అంత ప్రేమ ఉంటే జిల్లాకు 4 వ్యాగన్ల యూరియా తెప్పించాలని ఎంపీ అర్వింద్‌కు సవాల్‌ విసిరారు.