శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Sep 05, 2020 , 01:54:27

పేదలకు వరం ‘కల్యాణ లక్ష్మి’

పేదలకు వరం ‘కల్యాణ లక్ష్మి’

  • కామారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభరాజు

నిజాంసాగర్‌: కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరంలా మారిందని కామారెడ్డి జ డ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభరాజు అ న్నారు. శుక్రవారం మండలంలోని మ హ్మద్‌నగర్‌ గ్రామంలో మహ్మద్‌నగర్‌, గున్కుల్‌, నర్వ, బుర్గుల్‌ గ్రామాలకు చెం దిన 39 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ ఆడ పిల్లల పెండ్లికి సీఎం కేసీఆర్‌ ఓ పెద్దన్న, మేనమామ పాత్ర పో షిస్తున్నారని అన్నారు. సంక్షేమ, అభవృద్ధి పథకాల్లో  రాష్ట్రం నంబర్‌వన్‌ స్థా నంలో నిలిపారని తెలిపారు. ప్రస్తుతం మహిళలతో పాటు, రైతుల క్షేమం కోసం ఉచిత విద్యుత్‌, రైతు బీమా, రైతు బం ధు పథకాలతో పాటు  వ్యవసాయ  శాఖ అధికారులు రైతు వాకిట్లో ఉండే విధంగా రైతు వేదికల నిర్మాణాలకు శ్రీ కారం చుట్టారని అన్నా రు. జడ్పీ మాజీ  చైర్మన్‌ దఫేదార్‌ రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు దుర్గారెడ్డి, సీడీసీ చైర్మన్‌ గంగారెడ్డి, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు విఠల్‌, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌, నాయకులు  పాల్గొన్నారు.


logo