గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Sep 02, 2020 , 02:48:50

కేసీఆర్‌, కేటీఆర్‌లకు తిరుగులేదు

కేసీఆర్‌, కేటీఆర్‌లకు తిరుగులేదు

  • రూరల్‌ ఎమ్మెల్యే  బాజిరెడ్డి గోవర్ధన్‌

నిజామాబాద్‌ రూరల్‌: ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు భవిష్యత్‌లోనూ తిరుగులేదని రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. మండలంలోని ఆకుల కొండూర్‌లో ఎమ్మెల్యే మంగళవారం పర్యటించారు. గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు, టీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్త శోభ మృతిచెందగా బాధిత కుటుంబానికి రూ.2లక్షల బీమా చెక్కును, ఇటీవల మృతి చెందిన రైతు దేవన్న కుటుంబానికి రూ.5లక్షల రైతుబీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ టీఆర్‌ఎస్‌ బీమా చేయిస్తున్నదని, దురదృష్టవశాత్తు కార్యకర్త మృతి చెందితే ఆ కుటుం బం రోడ్డున పడకుండా ఆదుకుంటున్నదన్నారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పు న రైతుబీమా అందిస్తూ అండగా నిలుస్తోందన్నారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అంతకుముందు విలేజ్‌ పార్కు ఏర్పాటు స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుమలత, వైస్‌ ఎంపీపీ అన్నంసాయిలు, సర్పంచ్‌ అశోక్‌, ఎంపీటీసీ సుధీర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బొల్లెంక గంగారెడ్డి, సంతోష్‌, మధుకర్‌రావు, ప్రేమ్‌దాస్‌ నాయక్‌, జితేందర్‌, కోర్వ గంగాధర్‌, మాధవరెడ్డి, అక్బర్‌, స్వామి, మోహన్‌, జమీర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

ఖలీల్‌వాడి/ఇందల్వాయి: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి పలువురు బాధితులకు ఆర్థిక సహాయం మంజూరు కాగా, నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. నిజామాబాద్‌ నగరంలోని క్యాంపు కార్యాలయంలో 33 మంది బాధితులకు ఎమ్మెల్యే బిగాల రూ.11,23,500 చెక్కులను అందజేశారు. చాంద్రాయణ్‌పల్లికి చెందిన ఎన్‌.ప్రకాశ్‌కు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌  తన ఇంటిలో రూ.18వేల చెక్కును అందజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో వీడీసీ చైర్మన్‌ నవీన్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు అరటి రఘు, సభ్యులు రూప్‌సింగ్‌, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.


logo