గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Sep 02, 2020 , 02:48:54

బై బై వినాయకా !

బై బై వినాయకా !

  • lకొవిడ్‌ నిబంధనలు పాటిసూ శోభాయాత్ర
  • lసార్వజనిక్‌ గణేశ్‌ మండలి శోభాయాత్రను  ప్రారంభించిన అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల  

ఇందూరు / నిజామాబాద్‌ సిటీ : కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ వినాయక నిమజ్జనం మంగళవారం ప్రశాంతంగా కొనసాగింది. నగరంలో సార్వజనిక్‌ గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రథాన్ని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బాల గంగాధర్‌ తిలక్‌ విగ్రహానికి ఫూలమాలలు వేసి మాట్లాడారు. వచ్చే వినాయక చవితిలోగా అన్ని విఘ్నాలు తొలగిపోవాలని, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా అంతరించిపోవాలని కోరుకున్నట్లు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా శోభాయాత్రను నిర్వహిస్తున్న సార్వజనిక్‌ గణేశ్‌ మండలి ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మెల్యే వెంట సార్వజనిక్‌ గణేశ్‌ మండలి అధ్యక్షుడు బంటు గణేశ్‌ ఉన్నారు. 

ఏర్పాట్లు చేసిన మున్సిపల్‌ సిబ్బంది..

వినాయక్‌నగర్‌లోని గణపతుల బావి వద్ద మున్సిపల్‌ సిబ్బంది నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర నిర్వహించే రోడ్డును బాగు చేయడంతో పాటు కరోనా నేపథ్యంలో వినాయకుల బావి వద్ద శానిటేషన్‌ చేశారు. భక్తులు ఇంట్లో, కాలనీల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. 


logo