గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Aug 31, 2020 , 01:03:00

డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఆదర్శం

డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఆదర్శం

రుద్రూర్‌: నిజామాబాద్‌ జిల్లాలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఆదర్శంగా నిలుస్తున్నాయని నిర్మల్‌ జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఆదివారం వారు నిజామాబాద్‌ జిల్లాలోని తగిలేపల్లి, అంబం, అక్బర్‌ నగర్‌ గ్రామాల్లో పర్యటించి, డబుల్‌బెడ్‌రూం ఇండ్లను పరిశీలించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో అన్ని సౌకర్యాలతో ఇండ్ల నిర్మాణం కొనసాగుతుండడం అందరి దృష్టిని ఆకర్షిం చింది. ఈ నేపథ్యంలో   నిర్మల్‌ జిల్లా అధికారులు స్వ యంగా వచ్చి డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల వద్ద రోడ్ల వెడల్పు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, ఇంటి ముందు స్థ లాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. నిజామాబాద్‌ జిల్లాలో పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల వద్ద ఉన్న వాతావరణం, లబ్ధిదారులకు అనుకూలంగా ఉండే పరిస్థితులను ఎలా కల్పించాలనే అంశాలను తెలుసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను అందజేస్తున్నామని నిజామాబాద్‌ డివిజన్‌ ఇంజినీర్‌ నాగేశ్వర్‌రావు ఈ సందర్భంగా వారికి వివరించారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచినట్లు తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను పరిశీలించిన వారిలో పంచాయతీరాజ్‌ డీఈ చందు, నిర్మల్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ మురళీధర్‌రావు, మిషన్‌ భగీరథ ఈఈ దేవేందర్‌రెడ్డి, డబుల్‌బెడ్‌రూం ఇండ్ల ఇన్‌చార్జి రహీముద్దీన్‌, అసిస్టెంట్‌ నోడల్‌ అధికారి రెడ్డి శంకర్‌ తదితరులు ఉన్నారు. logo