బుధవారం 28 అక్టోబర్ 2020
Nizamabad - Aug 30, 2020 , 02:25:35

పాలిసెట్‌ పకడ్బందీగా నిర్వహించాలి

పాలిసెట్‌ పకడ్బందీగా నిర్వహించాలి

  • lకొవిడ్‌ నిబంధనలు పాటించాలి
  • lపరీక్షా కేంద్రాల వద్ద వసతులు కల్పించాలి
  •  lఅధికారులతో సమీక్షలో       అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

ఇందూరు : పాలిసెట్‌ను పకడ్బందీగా, కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం ఆయన తన చాంబర్‌లో పాలిసెట్‌ నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్‌ 2వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్న ప్రవేశపరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు 10 గంటల నుంచి అనుమతిస్తారని, 11 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 3,551 విద్యార్థులకు హాజరుకానున్నట్లు తెలిపారు. విద్యా, రెవెన్యూ, పోలీసు శాఖల నుంచి స్పెషల్‌ ఆఫీసర్‌, స్కాడ్‌, అబ్జర్వర్లను నియమించినట్లు చెప్పారు. మున్సిపల్‌ సిబ్బందితో అన్ని సెంటర్లను శానిటైజ్‌ చేయించాలని సూచించారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో వైద్యశాఖ ప్రత్యేక శిబిరాలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ప్రతి విద్యార్థి మాస్కు ధరించాలని, వాటర్‌ బాటిల్‌ వెంట తెచ్చుకోవాలని సూచించారు. కేంద్రాల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ ఉంటుందన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, ఆర్డీవో రవి, సెట్‌ కో-ఆర్డినేటర్‌ శ్రీరామ్‌కుమార్‌, డీఈవో దుర్గాప్రసాద్‌, ఆరోగ్య, విద్యుత్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.logo